గుజరాత్ టైటాన్స్ 178 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్లుగా శుబ్మాన్ గిల్ మరియు షాహాలు వచ్చారు.. సాహా ఆరంభం నుండి వేగంగా ఆడాలన్న ప్రయత్నం లోనే ఉన్నాడు. ప్రతి బంతిని హిట్ చేయాలన్న కసితోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ శుబ్మాన్ గిల్ మాత్రం ప్రతి షాట్ ను ఎంతో కంట్రోల్ గా ఆడుతున్నాడు. ఎందుకంటే పవర్ ప్లే ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆ తర్వాత టార్గెట్ ను నిదానంగా సాధించవచ్చు.
ఇదే విధంగా కనుక ఆడితే ఓవర్ల లోనే లక్ష్యాన్ని చేధించే అవకాశం ఉంది. అయితే అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో ఫామ్ లో ఉన్న సాహా రాజవర్ధన్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి శివమ్ దుబే పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. కానీ సాహా (25) స్కోర్ వలన గుజరాత్ పై కాస్త ఒత్తిడి తగ్గిందని చెప్పాలి.