ఐపిఎల్ ఆరంభ మ్యాచ్ లో చెన్నై మరియు గుజరాత్ లు అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు డే నైట్ మ్యాచ్ లో తలపడ్డారు. టాస్ గెలిచిన గుజరాత్ ఫీల్డింగ్ ఎంచుకోగా … బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇందులో రుతురాజ గైక్వాడ్ 92 పరుగులు చేశాడు. అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు అద్భుతమైన స్టార్ట్ ను ఇచ్చారు.
ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న తరుణంలో వరుసగా వికెట్లు పడడంతో ఆఖర్లో కాస్త టెన్షన్ నెలకొంది. ఆఖరి 2 ఓవర్ లకు 23 పరుగులు చేయాల్సిన సమయంలో చెన్నై ఫేవరేట్ గా ఉంది. కానీ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ మొదటి రెండు బంతులను సిక్స్ మరియు ఫోర్ గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. దీపక్ చాహర్ వేసిన ఆ ఓవర్ లో మొత్తం 15 పరుగులు వచ్చాయి.. ఇక ఆఖరి ఓవర్ కు 8 పరుగులు అవసరం కాగా… .మొదటి రెండు బంతులను తెవతియ సిక్స్ మరియు ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. దీనితో సీజన్ లో మొదటి మ్యాచ్ ను డిఫెండింగ్ ఛాంపియన్స్ విజయంతో ఆరంభించింది.