గుజరాత్ లో భారీ ప్రమాదం…. గ్యాస్ లీక్ అయి ఆరుగురు మృతి

-

eakగుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో భారీ ప్రమాదం జరిగింది. నగరంలోని సచిన్ ప్రాంతంలో రసాయనాలు నింపిన ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందారు. చాలా మందికి కార్మికులకు ఊపరి ఆడకపోవడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం 20 మందిని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. సూరత్ లోని సచిన్ జిఐడిసి ప్రాంతం అంతా పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. రసాయన పదార్ధాలు నిండిన ట్యాంకర్ నుంచి రసాయనాలు తొలగించే వేళ ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విషవాయువు వ్యాపించిన క్షణాల్లోనే సమీపంలోని విశ్వప్రేమ్​ మిల్​లో పని చేసే కార్మికులు సృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్మికులంతా కెమికల్​ ట్యాంకర్​కు 8-10 మీటర్ల దూరంలో నిద్రిస్తుండగా.. ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news