ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో బదిలీలు, పోస్టింగులు..!

-

ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను మరో రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది. ఉపాధ్యాయులు సహా జిల్లా స్థాయి పోస్టులకు సంబంధించిన ప్రక్రియ దాదాపు గా పూర్తి కాగా.. జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ పోస్టుల కసరత్తు కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో పోస్టింగులు ఇచ్చి వీలైనంత త్వరగా… ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తుంది కేసీఆర్‌ సర్కార్.

kcr
kcr

జిల్లా స్థాయిలోని రెండున్నర లక్షల ఉద్యోగులకు గానూ.. దాదాపు 38 వేల మంది కొత్త ప్రాంతాలకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అప్పీళ్లు, భార్యా భర్తల కేసులు సహా ప్రత్యేక కేటగిరీలు సహా అన్నింటినీ పరిశీలించాకే ఖాలీలకు అనుగుణంగా పోస్టింగులు ఇచ్చినట్లు చెబుతున్నారు. అటు జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ పోస్టులకు సంబంధించి.. కూడా ప్రక్రియ వేగవంతం చేశారు. కేటాయింపులతో అప్పీళ్ల పరిష్కారం దాదాపు గా పూర్తయిందని.. అంటున్నారు. మొత్తానికి ఉద్యోగులకు అనుగుణంగా ఉండాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news