ఐపీఎల్ సీజన్ 2022 ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ రసవత్తరంగా సాగుతోంది. నేడు ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్ చేరగా.. ఆర్‌సీబీ వరుస పరాజయాలతో ప్లేఆఫ్ ఆశలు గల్లంతు చేసుకుంది. నేటి మ్యాచ్‌లో గుజరాత్‌ను భారీ తేడాతో ఓడిస్తేనే ఆర్‌సీబీకి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి.
తొలి అంచె పోటీలో ఆర్‌సీబీపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తెవాటియా, మిల్లర్‌లు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించారు.