నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలకలం రేగింది. గన్ మిస్ ఫైర్ ఘటన అందరినీ భయబ్రాంతులకు గురిచేసింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. గన్ పేలిన ఘటనలో ప్రాణాపాయం మాత్రం తప్పింది. కానిస్టేబుల్ శంకర్‌గౌడ్ తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ తూటా దూసుకెళ్లడంతో ఛాతీకి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ఏరియా ఆస్పత్రకి తరలించారు.