ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో పాటు రాజకీయ విమర్శలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షం, అధికారపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనేఉంది. తాజాగా ఏపీలో ఇసుక కొరతపై మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ అవుతోందని ఉమా అన్నారు. వైసీపీ నేతల గుప్పెట్లో మాత్రం వేల టన్ను ఇసుక ఉంటోందన్నారు. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్‌యార్డ్ లో 20వేలు చూపడం లేదని తెలిపారు. లారీలను ఆపిన అధికారులను బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అండర్ కవర్ అవినీతితో ఇసుక దోపిడీతో రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్ సమధానం చెప్పాలన్నారు.