Breaking : గ‌న్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

-

తుపాకి మిస్ ఫైర్ కావ‌డంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌ల కొమారం ప‌రిధి కాచ‌న‌ప‌ల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. కాగ తుపాకి మిస్ ఫైర్ కావ‌డంతో సంతోష్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఆయుధాలు ప‌రిశీలిస్తుండ‌గా.. ఒక తుపాకి మిస్ ఫైర్ అయింద‌ని కాచ‌న ప‌ల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు.

కాగ హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృత దేహాన్ని భ‌ద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి పోలీసులు త‌ర‌లించారు. కాగ హెడ్ కానిస్టేబుల్ సంతోష్ వ‌రంగ‌ల్ జిల్లా గ‌విచ‌ర్ల కు చెందిన వాడు. విధుల నేప‌థ్యంలో భ‌ద్రాద్రి జిల్లా కాచ‌న‌ప‌ల్లి లో ఉంటున్నాడు. కాగ మూడు రోజుల క్రితమే హెడ్ కానిస్టేబుల్ సంతోష్ కు త‌ల్లి దండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల‌లో వివాహం కూడా చేయాల‌ని సంతోష్ త‌ల్లి దండ్రులు భావించారు. అంత‌లో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ తుపాకి మిస్ ఫైర్ కావ‌డంతో మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news