శవాలతో నిండిన జీజీహెచ్ మార్చురీ..?

-

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య కొన్ని ఆస్పత్రుల్లో దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.. ప్రస్తుతం సాధారణంగా చనిపోయిన వారికి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో… మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించేందుకు జాప్యం జరుగుతోంది. కరోనా వైరస్ ఫలితాలు వచ్చేంతవరకు మృతదేహాలను మార్చురీలోనే ఉంచాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మార్చురి లు సామర్థ్యానికి మించి మృతదేహాలతో నిండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని జిజిహెచ్ మార్చురీ పూర్తిగా శవాలతో నిండి పోయింది.

సాధారణంగా అయితే జిజిహెచ్ మార్చరీ కెపాసిటీ 30 శవాలు మాత్రమే మాత్రమే కానీ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య నిర్వహిస్తున్న పరీక్షల తో 50 వరకు శవాలు ఉన్నాయి. చనిపోయిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం..వాటి ఫలితాలు వెల్లడి లో జాప్యం జరుగుతూ ఉండటం కారణంగా ఈ పరిస్థితి నెలకొన్నది వైద్య సిబ్బంది చెబుతున్నారు. కరోనా పరీక్షల ఫలితాలు వచ్చేంతవరకూ మృతదేహాలను తమ కుటుంబీకులకు అప్పగించేందుకు అధికారులు నిరాకరిస్తూన్న నేపథ్యంలో శవాల సంఖ్య పెరిగిపోతుంది, ఆస్పత్రిలో ఏ రోగంతో మృతిచెందిన కరోనా పరీక్షల తర్వాతనే వైద్య సిబ్బంది శవాన్ని కుటుంబీకులకు అప్పగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news