గుంటూరు రూరల్ మండలం లాల్ పురం వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ నుంచి మెయిన్ రోడ్డువైపు వస్తుండగా హ్యూందయ్ ఐ 20 కారు అతివేగంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన అనంతరం అటువైపుగా వేగంగా వస్తున్న వ్యాన్ను ఢికొనడంతో ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరందరూ బీటెక్ సెకండ్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా తెలుస్తోంది. కారు అతివేగంగా ఉండటంతో కారు నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు విద్యార్థులు మృతిచెందడంతో తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది.