నాని జెర్సీ ఫస్ట్ లుక్.. ఆటకి సిద్ధం

-

నాచురల్ స్టార్ నానికి 2018 పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. 2017 డిసెంబర్ లో రిలీజైన ఎం.సి.ఏ సినిమాతో కూడా హిట్ అందుకున్న నాని ఆరు హిట్లు తర్వాత రెండ్ ఫ్లాపులు ఎదుర్కున్నాడు. ఇక ప్రస్తుతం నాని గౌతం తిన్ననూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడ్. జెర్సీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.

ఆటకి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్న పోస్టర్ తో నాని జెర్సీ పోస్టర్ వచ్చింది. అజ్ఞాతవాసి తర్వాత అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇది కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా న్యూ ఇయర్ విశెష్ తో సర్ ప్రైజ్ చేశారు. మరి పెవిలియన్ లో సిక్సులు కొట్టినట్టుగా జెర్సీ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news