గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లో కుర్చున్న వసూ రిషీ అన్న మాటలను తలుచుకుంటూ ఉంటుంది. నన్ను ఎందుకు అలా అపార్థం చేసుకున్నారు, నన్ను అడిగితే ఒక మాట చెప్పేదాన్నికదా, మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులోంచి తీసేస్తారు, సరే ఇప్పటికైనా నిజం తెలిసిందికదా, ఫోన్ చేయొచ్చుకదా..చేయరు. ఈసారి కనిపిస్తే నేను అడిగేవి అన్నీ పేపర్ మీద రాసుుకని అడిగేస్తా అనుకుంటూ రిషీ సార్ ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషీ ఫోన్ చేస్తాడు. చేసేవి అన్నీ చేసేసి..సారీ వసుధార నేను అలా అనుకున్నాను అని సింపుల్ గా తేల్చేస్తారు అని ఫోన్ కట్ చేస్తుంది. రిషీ మళ్లీ మళ్లీ చేస్తాడు. ఫైనల్ గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఎలా ఉన్నావు అని రిషీ అంటే..అలానే ఉన్నా అంటుంది వసూ. వర్షంలో తడిచావు కదా ఆరోగ్యం ఎలా ఉంది అని రిషీ అంటే.. నేనేం మొలకెత్తనులే అని..నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి, మాట్లాడాలి అని సీరియస్ గా అంటుంది. రిషీ ఓహో అలానా అంటాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో వసూ వెళ్లి చూస్తుంది. రిషీయే వస్తాడు. రిషీని చూసిన వసూకి దెబ్బకి సౌండ్ ఆఫ్..రండి సార్ అని సోఫాలో కుర్చుంటారు.
ఏం మాట్లాడరు కాసేపు..రిషీ మాట్లాడొచ్చుకదా అనుకుంటాడు. వసూ మనసులో ఇక్కడిదాకా వచ్చి రిషీ సార్ ఏంటి మాట్లాడటం లేదు..ఏదైనా మాట్లాడొచ్చుకదా..నేనే ముందు మాట్లాడాలని చూస్తున్నారా అనుకుంటుంది. ఇలా ఇద్దరూ ఒకేసారి స్టాట్ చేస్తారు. రిషీ ముందే నువ్వే చెప్పు, ఇందాక ఏదో చాలా మాట్లాడాలి అన్నావుకదా అంటాడు. వసూ లేచి నిలబడుతుంది.కళ్లలో బాధతో రిషీని హగ్ చేసుకుంటుంది. మనోడుకి ముందు ఏం చేయాలో అర్థంకాదు. రాయిలా నుల్చుంటాడు. వసూ గట్టిగా రిషీని పట్టుకుని ఏడ్చేస్తుంది. ఈ సీన్ బాగుంటుంది. వసూ సార్ కోపం వస్తే తిట్టండి, కోపం తగ్గకపోతే మెసేజ్ లో తిట్టండి అంతేకాని నాతో మాట్లాడకుండా ఉండకండి సార్, నన్ను దూరం పెట్టకండి, నన్ను అపార్థం చేసుకోవద్దు, నా గురించి మీ మనసో ఎన్ని ప్రశ్నలు ఉన్నా నన్ను డైరెక్టుగా అడగండి, నేను చెప్తాను, అంతేకాని మీరు మనసులో ఏదో ఊహించుకోని నన్ను దూరంపెట్టకండి..నేను తట్టుకోలేను అంటుంది. రిషీ కూడా రిటర్న్ హగ్ ఇస్తాడు. ఓర్నీ ఇదంతా..వసూ కల. రిషీ హలో వసుధార ఏదో మాట్లాడాలి అన్నావుకదా అంటాడు..పాప అంటే ఇదంతా నా ఊహేనా, రిషీ సార్ వచ్చాక ఇలా అయిపోయాను ఏంటి అనుకుంటుంది. రిషీ ఏం మాట్లాడవేంటి అంటే..మాట్లాడటానకి ఏం లేదు సార్ అంటుంది వసూ. ఆరోగ్యం ఎలా ఉంది అని రిషీ అడిగితే..బానే ఉంది అని ఇప్పుడే వస్తాను సార్ అని లోపలికి వెళ్తుంది.
కాలేజ్ లోఅందరూ మీటింగ్ లో కుర్చుంటారు. ఫణీంద్ర రిషీ కూడా ఉంటే బాగుండేదికదా అని అంటాడు. మహేంద్ర రిషీకి ఏదో చిన్నపని ఉందన్నాడు..మనం మీటింగ్ స్టాట్ చేద్దాం అంటాడు. అలా మీటింగ్ స్టాట్ చేస్తారు. మహేంద్ర రిషీ మళ్లీ ఏమైనా డిస్టబ్ అయ్యాడా, ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని ఆలోచిస్తాడు..ఇంట్లో వసూ రిషీ కోసం కాఫీ కలుపుతుంది. రిషీ వసూకోసం వసూ రూంలోకి వెళ్తాడు. అక్కడ ఒకప్పుడు రిషీ ఇచ్చిన నెమలీకను చూస్తాడు. క్లాస్ బుక్స్ ఎక్కడ పెట్టింది అనుకుని చూస్తాడు. రిషీ హాల్ లో లేకపోయే సరికి వసూ కూడా రూంలోకి వస్తుంది. ఏం కావాలి సార్ అని వసూ అడిగితే..బుక్స్ కోసం వచ్చాను, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా ఇంపార్టెంట్ చాప్టర్స్ టిక్ చేసి ఇస్తాను అంటాడు. వసూ బుక్ ఇస్తుంది. నువ్వేం చేస్తున్నావ్ అంటే..కిచెన్ లో ఉన్నాను, అయ్యో పాలు పెట్టాను మర్చేపోయాను రండీసార్ మీరు కూడా అని వసూ వెళ్లిపోతుంది. కబోర్డ్ లో వసూ ఓసారి కట్టుకున్న బ్లూ సారి చూసి మనోడు మళ్లీ ఆ సీన్ తలుచుకుంటాడు.
ఇంకోపక్క దేవయాని రిషీ గురించి ఆలోచిస్తుంది. గౌరవం ఇస్తున్నట్లే ఉంటాడు..అడిగితే ఏం చెప్పడు. మహేంద్రను అడిగితే రిషీ గురించి ఏం చెప్పడు అనకుని వంటగదిలో పనిచేసుకుంటున్న ధరణిని చేస్తుంది. విసుక్కున్నా, అరిచినా ధరణినే కదా నాకు ఇప్పుడు దిక్కూ మొక్కు, ఇప్పుడు దీన్ని ప్రేమగా పిలవాలా, తప్పదుగా అనుకుని ఎక్కడలేని ప్రేమతో పిలుస్తుంది. చెప్పండి అత్తయ్యాగారు అని ధరణి అంటే..దేవయాని పక్కన కుర్చోపెట్టుకుని, ఏం లేదు ధరణి ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం అనమాట అని ఈ మధ్య రిషీలో ఏదో మార్పు వచ్చింది కదా అంటుంది. ధరణీకూడా అవును అత్తయ్యగారు నాకు కూడా అనిపించింది అంటుంది. ఎందుకంటావు, ఊరికే అడుగుతున్నా, మనలో మన మాట, ఎందుకుఅంటావ్ అని దేవయాని అడుగుతుంది. ధరణి బిత్తర చూపులు చూస్తుంది. ఓకే తెలియదు అంటావు అంతేకదా, తెలియకపోతే తెలుసుకుందాం అని నీ ఫోన్ ఎక్కడుంది అని అడుగుతుంది దేవయాని..కిచెన్ లో ఉంది అనటంతో వెళ్లి తీసుకురా అంటుంది. నీ ఫోన్ నుంచి రిషీకి ఫోన్ చేయవా అంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.
తరువాయిభాగంలో రిషీతో దేవయాని మాట్లాడుతుంది. ఎక్కడికి వెళ్లావు అంత పొద్దున్నే అని..సరిగ్గా అదే టైంకి వసూ కాఫీనా. టీనా అని అరుస్తుంది. దేవయాని ఎవరు నాన్న ఎవరిదో గొంతు వినిపిస్తుంది అంటుంది. వసూ మళ్లీ ఎవరు సార్ ఫోనులో అంటుంది. రిషీ మళ్లీ కాల్ చేస్తాను పెద్దమ్మా అని కాల్ కట్ చేస్తాడు. వసూ దగ్గరకు వచ్చి నేను ఏమైనా మీ రెస్టారెంట్ కి వచ్చానా, కాఫీ, టీ అడిగానా అని అరుస్తాడు. చూడాలి రేపు ఇంకేం జురుగుతుందో.