కార్తీకదీపం ఎపిసోడ్ 1203: మోనితకు ఊహించని షాక్‌ ఇవ్వబోతున్న దీప..బాలసాల పేరుతో కొత్తప్లాన్‌ వేసిన మోనిత..!

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ వాళ్లు టపాసులు పేల్చుకుంటూ ఉండగా మోనిత సౌందర్యకు ఫోన్ చేస్తుంది. దీపావళి పండుగ శుభాకాంక్షలు అంటుంది. ఎందుకు ఫోన్ చేశావు అని సౌందర్య అడిగితే..ఎంతకాదు అనుకున్నా నేను మీ కోడలన్నే కదా..మీ మనవడికి ఒంట్లో బాలేదు, కార్తీక్ ను రమ్మంటారా..పోనీ మీరు వచ్చినా పర్లేదు..పండుగ ఎలా చేసుకున్నారు, స్వీట్స్ చేసుకున్నారా, అయినా వంటలక్కే ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్స్ కి ఏం కరువులే అని మోనిత కావాలనే సౌందర్యను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. సౌందర్య ఏం మాట్లాడదు. ఇంతలో టపాసులు కాలుస్తున్న కార్తీక్. దీపలు..కార్తీక్ దీప జాగ్రత్త చీరకాల్తుంది అంటాడు. ఆ మాటలు విన్న మోనితకు చిర్రెత్తుకొస్తుంది. ఫోన్ కట్ చేస్తుంది. పండగరోజు కూడా ప్రసాంతంగా ఉండటం దానికి ఇష్టంలేనట్లు ఉంది, ఈ విషయం కార్తీక్ కి చెప్పటం అవసరమా అనుకుంటుంది. వీళ్లేంటో ఎవరికి వారు ఏది షేర్ చేసుకోకుండా ఉంటారు.

karthika-deepamతెల్లారుతుంది. మోనిత ఏంటో నాలుగురోజులనుంచి ఒకటే గెట్ అప్ లో ఉంటుంది. దీప, కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. ఇంత జరిగినా కార్తీక్ కు నా మీద ప్రేమరాలేద, దానిమీద ప్రేమ తగ్గలేదు అనుుకంటుంది. ఇంతలో ప్రియమణి వచ్చి ఏమిటమ్మా అలా ఉన్నావు, కార్తీకయ్య ఏమైనా అన్నాడా అంటుంది. అసలో కోపంతో చిర్రెత్తిపోతున్న మోనితకు ప్రియమణి మాటలతో ఇంకా కాల్తుంది. నాలుగు తిట్టి వెళ్లి కాఫీతీసుకురా అని పంపిస్తుంది. కార్తీక్ దీప జాగ్రత్త చీరకాల్తుంది అన్న మాటలు తలుచుకుంటూ ఉంటుంది.

ఇంకోపక్క కార్తీక్, సౌందర్య, ఆనంద్ రావు దీప గురించి చర్చించుకుంటారు. తన ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది, ఏదో గట్టినిర్ణయం తీసుకుని ఉంటుంది అని కార్తీక్ అంటాడు. ఇంత జరిగాక దీప అంత బ్యాలెన్స్ గా కూల్ గా ఎలా ఉంటుంది మమ్మీ అంటుంది. నాకు ఏం అర్థంకావటంలేదు అని సౌందర్య రాత్రి మోనిత ఫోన్ చేసిందిరా, బాబుకు ఏదో అని చెప్పబోతుంది. కార్తీక్ ప్లీజ్ మమ్మీ ఆ మోనిత. ప్రస్థావన తీసుకురావొద్దు అంటాడు. ఆనంద్‌రావు దీపకు బర్త్‌డే విషేస్‌ చెప్పాలన్నా భయంగా ఉందిరా అంటాడు. ఇలా వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే..దీప పిల్లలతో నవ్వుకుంటూ మెట్లు దిగుతుంది.

దీపను చూసిన ఈ ముగ్గురకి మాటలుండవు. ఆదిత్య,శ్రావ్య కూడా అలానే చూస్తారు. దీప మాత్రం ఏదో గిఫ్ట్‌ ఇచ్చారు, అలాంటి గిఫ్ట్‌ నాకు ఈ జన్మలో ఎవరూ ఇవ్వలేరు తెలుసా అంటుంది. అత్తమావలు దగ్గరకు వెళ్లి ఆశీర్వదించండి అంటుంది. ఇక్కడ కూడా దీప ఏదోదో మాట్లాడుతుంది. డాక్టర్ బాబు మీరు కూడా నన్ను ఆశీర్వదించండి..లేవండిలేచి నుల్చోండి అని అంటుంది . కార్తీక్ లేస్తాడు. అప్పుడే మోనిత ఎంట్రీ ఇస్తుంది. ఓ ఐదారు దీవెనెలు ఇచ్చేయండి కాలుమొక్కుతుంది..అప్పుడే మోనిత హ్యాపీబర్డే దీపక్కా అని బొకేతో వస్తుంది. మోనితను చూసి అందరూ షాక్ అవుతారు.

దీప మాత్రం ఎక్కడా తగ్గదు. బొకే తీసుకుని థ్యాంక్యూ మోనత, బొకే బాగుంది మోనిత, ఏదేమైనా నీ సెలక్షన్ సూపరుగా ఉంటుంది తెలుసా అంటుంది. మోనిత పిల్లలను పలకరిస్తుంది. వాళ్లు కారు దగ్గర ఉంటాం అని వెళ్లిపోతారు. తెలివైన పిల్లలను అని,అందరిని పలకరిస్తుంది. ఏంటి అందరూ సైలెంట్‌గా ఉన్నారు, నారాకను ఊహించలేదా, ఏంటి కార్తీక్‌ హాస్పటల్‌కి వెళ్తున్నావా అంటుంది. కార్తీక్‌ షట్‌అప్‌ మోనిత, ఎందుకు వచ్చావ్‌, వెళ్లు అని అరుస్తాడు. దీప అదేంటి డాక్టర్‌బాబు ఇంటికి వచ్చిన వాళ్లను వెళ్లమనటం మర్యాదకాదు కదా, పాపం ఎన్ని తిట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా బర్త్‌డేకి వచ్చింది, బొకేకూడా తెచ్చింది వెళ్లమంటారేంటి డాక్టర్‌బాబు అంటుంది. దీప మాటలకు అక్కడున్నవారంత షాకైైచూస్తారు. మోనిత ఏంటిది..దీప ఇంతలా మాట్లాడుతుంది అని టెన్షన్‌ పడుతుంది. మోనితతో దీప నీ ఆరోగ్యం బానే ఉందా, గుడికి అని బయలుదేరాను..లేకపోతే కాఫీ, టీలు ఇచ్చి మర్యాదలు చేసేదాన్ని, సరే మాతోపాటు గుడికి వచ్చేసేయ్‌, ఎంతకకాదన్నా నువ్వు మా ఫ్యామిలో ఒకదానివనే అనుకుంటాను, గుళ్లు, పూజలు అంటే నీకు కూడా బాగానే ఇష్టం పద మోనిత గుడికి వెళ్తాం అని దీప అంటే..నేను గుడిలో దేవుడికన్నా నేను గుండెల్లో దేవుడినే నమ్ముతాను అంటుంది. మనసులో మాత్రం ఏంటి దీప రెచ్చిపోతుంది, గుళ్లో ఏమైనా ప్లాన్‌ చేసిందా అనుకుని మీరు వెళ్లిరండి అంటుంది. అయ్యే మోనిత ఒట్టి అమాయకపు పక్షిలా ఉన్నావు అంటుంది దీప. మోనిత నేను గుడికి రావటం కాదుకానీ, మీరే రేపు మా ఇంటికి రావాలి, మా అబ్బాయి బారసాల చేస్తున్నాను అంటుంది మోనిత.

అందరూ మా ఇంటికి రావాలి అని పేరుపేరున చెప్తుంది. అయ్యో మర్చిపోయాను కార్తీక్‌ నువ్వుకూడా రావాలి అంటుంది. కార్తీక్‌ నోర్‌మూయ్‌, ఎక్కువ మాట్లాడకుండా బయటకువెళ్లు అని అరుస్తాడు. అదేంటి కార్తీక్‌ బాబు నా బాబేకాదుకదా అంటుంది. నువ్వు ఒక్క క్షణం ఇక్కడే ఉంటే..ఏం చేస్తానో నాకే తెలియదు అంటాడు. ఏం చేస్తావ్‌ కొడతావా కొట్టు అని మోనిత..అందరూ మాట్లాడరేంటి, మీ వంశాంఖురమే కదా అని సింపథి ప్లే చేస్తుంది. నీ కన్నా దీపక్కామంచిది, నన్ను అర్థంచేసుుకంది, ఆ దీపక్కా అసలు ఏం జరిగిందో నీకు పూర్తిగా తెలుసుకదా అని మోనిత అంటే..నాకు అన్నీ తెలుసు కదా నువ్వే కదా చెప్పావ్..మోనిత నువ్వెళ్లి బారసాలకు ఏర్పాట్లు చేసుకో, వీళ్లందరిని తీసుకొచ్చే బాధ్యత నాది అంటుంది మోనిత. కార్తీక్‌ వాళ్లు షాకై అలానే చూస్తారు. మోనిత లోపల టెన్షన్‌ పడుతున్నా బయటకు మాత్రం ధ్యాంకూ దీపక్కా, నువ్వు ఈ మాట అన్నావు చాలు అని వస్తారుగా అని మోనిత అంటే..నేను తీసుకొస్తాను అంటున్నా కదా, నువ్వు హ్యాపీగా వెళ్లు అని..మోనిత దగ్గరకు వచ్చి నీకు చెప్పాను కదా మోనిత నీ సినిమాకు క్లైమాక్స్‌ అదిరోపయోలా చూపిస్తాను అని చెబుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్‌ ముగుస్తుంది.

తరువాయిభాగంలో కార్తీక్‌, సౌందర్య, ఆనంద్‌రావులు దీప గురించి టెన్షన్‌ పడుతూ ఉంటారు. దీప ఆలోచనలు మనం అందుకో లేకపోతున్నాం..ఏదో గట్టి నిర్ణయమే తీసుకుంది అంటాడు కార్తీక్..కారు వచ్చిందిరా దీప వచ్చే ఉంటుంది అంటది సౌందర్య. పిల్లలు మాత్రమే వస్తారు. అమ్మేది అని కార్తీక్‌ అంటే..అమ్మ వెళ్లిపోయింది నాన్ను, రేపు మిమ్మల్ని ఎక్కడికో రమ్మంది అంటకదా,,అక్కడ కలుస్తాను అని చెప్పింది అని శౌర్య అంటుంది. సోమవారం దీప ఏం చేయబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news