ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడే మనతో పని చేయించుకున్నారు. మిషన్ కాకతీయలో చెరువులను బాగు చేసుకున్నాం. సునీత నా బిడ్డ లెక్క ఆమె అడిగిన హామీలు అన్ని నెరవేరుస్తాను. కూసే గాడిద వెళ్లి మేసే గాడిదను తిట్టినట్టు డీకే శివకుమార్ మనకు చెబుతున్నాడు. డీకే శివకుమార్ ప్రచారం కోసం వచ్చారా..? ఇజ్జత్ తీసుకుంటందుకు వచ్చారా ? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నాడు.
మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం తెస్తే ససేమిరా అన్నాను. ఒకప్పుడు రైతు కొడుక్కి పిల్లను ఇవ్వకపోయేది. ఇప్పుడు భూమి ఉంటే చాలు పిల్లను ఇస్తామంటున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత భూముల ధరలు తగ్గుతాయన్నారు. కానీ ఇప్పుడు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. కరెంట్ ఉండదు.. చిమ్మని చీకట్లు ఉంటాయన్నారు. యాదగిరి గుట్ట గతంలో ఎట్టుంది.. ఇప్పుడు ఎట్టుంది అని ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నాడు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి ఏం తెలుసు అని చెప్పారు.