విశాఖ : బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. టిడిపిలో దృశ్యం 2 నడిస్తే…వైసీపీ పాలనలో గరుడ పురాణం 2 నడుస్తోందని ఫైర్ అయ్యారు. గరుడ పురాణం 2 ఎలాగైనా ఫ్లాప్ అవుతుందని చురకలు అంటించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని.. మంత్రి పేర్ని నాని …బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణమన్నారు.. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించారు జివిఎల్ నరసింహారావు.
హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా?. కేంద్రంపై విమర్శలు చేస్తేనే మంత్రి పదవిలో కొనసాగిస్తారని భావిస్తున్నారా…!? అని నిలదీశారు. కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పర్యటనలో ఉండగా మంత్రుల వ్యాఖ్యలు చేయటంపై వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి? అని ప్రశ్నించారు జివిఎల్ నరసింహారావు. డిప్యూటీ సీఎం అమ్ జాద్ భాషా మళ్ళీ టిప్పుసుల్తాన్ భజన ఎందుకు చెస్తున్నారు? దీని వెనుక ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు.