అధికారులను పనులు చేసుకోనియ్యి సబ్బం!

-

తాను చేసింది తప్పు అని ఒప్పుకోరు.. అలా చేయడం నేరం అని అంగీకరించరు.. అధికారులు వారి పని వారు చేసుకుంటుంటే మాత్రం.. దాన్ని రాజకీయ కక్ష సాధింపు అని అంటున్నారు! అలా అయితే అందరికీ జరగాలి కదా.. సబ్బం హరికి మాత్రమే ఎందుకు జరుగుతుందంటే.. ఆయన దగ్గర సమాధానం ఉండదు!

తాజాగా గ్రేటర్ విశాఖ అధికారులు టీడీపీ నేత సబ్బం హరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఏ.పీ.ఎస్.‌సీ.బీ. లే అవుట్ ‌లో 18 ఎకరాలు ప్రభుత్వ భూముల జాబితాలో ఉన్నాయి. అయితే ఆ స్థలంలో సబ్బం హరి ఇంటి భవనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. నోటీసులు చేతికి ఇవ్వకపోతే గోడకు అంటించి వెళ్లిపోయారని మళ్లీ రచ్చ చేస్తారేమో అని భావించిన అధికారులు.. సబ్బం హరి ఇంటికి వెళ్లినా ఆయన అందుబాటులో లేరంట!

అయితే ఈ రోజు మరలా ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారంట అధికారులు. ఈ నోటీసులు అందుకున్న మూడు రోజుల్లో స్పందించకుంటే వాటిని తొలగిస్తామని అంటూ అధికారులు నోటీసులను సిద్ధం చేశారు. అయితే రాజకీయ కక్ష సాధింపుతోనే తనకు నోటీసులు ఇస్తున్నారని సబ్బం హరి వాదన! ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని భవనాలు కట్టుకోవడం ఎందుకు.. అధికారులు నోటీసులు ఇస్తే.. అది కక్ష సాధింపు చర్యనడం ఎందుకు? సబ్బం హరికే తెలియాలి!!

అధికారులు వారి పనులు వారు చేసుకుంటున్నప్పుడు…తనది తప్పైంతే ఒప్పుకోవాలి.. నోటీసులకు స్పందించాలి. తనది తప్పు కాని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చు. కానీ.. తాను చేసింది తప్పా కరెక్టా అన్నది మాత్రం సబ్బం హరి చెప్పరు.. అధికారులను పనులు చేసుకోనివ్వరు! ఎలా మరి?

Read more RELATED
Recommended to you

Latest news