దేశంలోనే అత్యధిక అత్యాచార కేసులు రాజస్థాన్‌లోనే నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా నివేదికల్లో వెల్లడించింది. అయితే ప్రతి ఫిర్యాదుకూ ఎఫ్ఐఆర్‌ను తప్పనిసరిగా నమోదు చేయడమే కేసుల పెరుగుదలకు కారణమని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే వాటిలోనూ సగం తప్పుడు ఫిర్యాదులు నమోదైనట్లు ఆయన చెప్పారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ ప్రసంగించారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రాజస్థాన్ ఉంది. అయితే నేరాల పెరుగుదల, నేరాల నమోదు వంటి విషయాలపై నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్‌లో నేరాలు చాలా తగ్గాయి. గతంలో పోలీసుల వైఖరితో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు వెనుకాడే వారని, తమ ప్రభుత్వ హయాంలో చాలా మార్పు వచ్చిందని గెహ్లాట్ పేర్కొన్నారు.