Tv 9, NTV పై చంద్రబాబు నిషేధం..!

-

Tv 9, NTV న్యూస్‌ ఛానెళ్ల పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నిషేధం విధించారు. ఈ విషయాన్ని గుంటూరులోని టీడీపీ ప్రధాన రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నియోజక వర్గ పార్టీ విస్థృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ నేత బుద్దా వెంకన్న షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌ గా మారింది.

కాగా.. గుంటూరు సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎ్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనను అంతమొందించడానికి టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు యుద్దానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల్లో స్పస్టమైన మార్పు కనిపిస్తోంది.. ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయా.. ఎప్పుడు ఈ పీడ విరగడవుతుందా అనే ఎదురుచూస్తున్నారని చంద్ర బాబు హాట్‌ కామెంట్స్‌ చేశారు. అలాగే.. ఏపీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తుందని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news