మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దారుణం జరిగింది. తన కారుకు మంటలు చెలరేగడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఈ ఘటన జరిగింది. ఆయన సంజయ్ షిండే అని వయసు 55 ఏళ్ళు అని పోలీసులు పేర్కొన్నారు. ఆయన ఎన్సీపీ పార్టీ తాలూకా యూనిట్ ఉపాధ్యక్షుడు అని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మంగళవారం మధ్యాహ్నం పింపాల్‌గావ్ బస్వంత్ టోల్ ప్లాజా సమీపంలో, షిండే ముంబై-ఆగ్రా రోడ్ లోని పింపాల్ గావ్ కు పురుగు మందుల కొనుగోలు కోసం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. వైరింగ్ లోని షార్ట్ సర్క్యూట్ కారణంగా అతని కారు మంటలకు గురైందని చెప్పారు. “మంటలను గమనించిన తరువాత, షిండే తన కారును ఆపడానికి ప్రయత్నించాడు, కాని దాని డోర్ లాక్ కావడంతో అతను బయటపడలేకపోయాడు. అతను కిటికీ తెరిచేందుకు ప్రయత్నించాడు, కాని అది కూడా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కారులోపల హ్యాండ్ శానిటైజర్ బాటిల్ ను గుర్తించామని దాని కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.