హనుమంతుని జన్మస్థలం తిరుమలే.. ఉగాది రోజున ప్రూఫ్ లు !

Join Our Community
follow manalokam on social media

‘ఆంజనేయుడు’ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు. అయితే అసలు హనుమంతుడు ఎక్కడ జన్మించాడు.? ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది.? ఈ ప్రశ్నలకు చాలా సమాధానాలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఆయన జన్మస్థలం గురించి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది మహారాష్ట్రలోని నాసిక్ అంటే.. మరికొందరు హర్యానా.. ఇంకొందరు ఝార్ఖండ్‌ అని చెబుతూ ఉంటారు. అయితే ఆయన మన తిరుమలలోనే జన్మించాడని టీటీడీ చెబుతోంది.

చెప్పడమే కాక ఆధారాలతో సహా ఉగాది పర్వదినం రోజున నిరూపిస్తామని టిటిడి చెబుతోంది. త్వరలోనే అన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెబుతున్నారు. అంజ‌నాద్రి మీద హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో నిరూపించేందుకు 2020 డిసెంబ‌రులో టిటిడి పండితుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసిన విష‌యం తెలిసిందే. ఈ క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశాలు నిర్వ‌హించి డీప్ రీసెర్చ్ చేసి హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారు. ఆ ఆధారాలు పుస్తక రూపంలో తీసుకురానున్నట్టు చెబుతున్నారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...