“హ‌ను మాన్” ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ అదుర్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ తాజాగా విడుద‌లైంది. కాగా ఈ టీజ‌ర్ ఎంతో ఆక‌ట్టుకునేవిధంగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో టీజ‌ర్ క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపిస్తుంది. ఇక ఇండియాలోనే హ‌నుమాన్ మొద‌టి సూప‌ర్ హీరో ఫిల్మ్ గా తెర‌కెక్కుతోంది. ఇప్పటికే డిఫ‌రెంట్ సినిమాల‌తో త‌న మార్క్ వేసుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగుతో పాటు మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ‌,త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ప్రైమ్ షో ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంధ‌ర్బంగా హ‌నుమాన్ టీజ‌న్ ను విడుద‌ల చేస్తూ అంజ‌నాద్రి కొండ‌ల నుండి హ‌నుమంతుడు వ‌చ్చాడ‌ని చిత్ర యూనిట్ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇదిలా ఉండ‌గా తేజ స‌జ్జ ఇటీవ‌లే జాంబిరెడ్డి అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆక‌ట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన తేజ సజ్జ ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయాడు. మరి ఈ సినిమా తేజకు ఎలాంటి విజ‌యాన్ని ఇస్తుందో చూడాలి.