హనుమాన్ జయంతి సందర్భంగా హైద్రబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలి గూడ రామాలయం నుండి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుండి కోఠీ, ఆశోక్‌నగర్ , కవాడీగూడ ల ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా తాడ్‌బండ్ వరకు శోభాయాత్ర చేరుకోనుంది. గౌలిగూడ నుండి తాడ్‌బండ్ లోని అంజనేయ స్వామి దేవాలయం వరకు సుమారు 12 కి.మీ మేర హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది.
హైదరాబాద్ పోలీసులు శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8000 మంది పోలీసులతో, 400 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ రోజు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే రోజు, గుడ్ ఫ్రైడే కూడా కావడంతో రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్రపారమిలటరీ దళాలు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లతో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు.ఇక శోభాయాత్ర జరుగుతున్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడ విధించారు.
టోల్ ఫ్రీ నెంబరు 9010203626, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 040-27852482