మనం ఆనందంగా ఉంటే సరిపోదు. మనతో పాటు ఇతరులను కూడా ఆనందంగా ఉంచడం చాలా ముఖ్యం. నిజంగా మనం ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తే ఆ ఆనందమే వీరు అబ్బా…! అయితే ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచాలంటే ఏం చేయాలి…? ఈ విషయానికి వస్తే… కొన్ని చిన్న చిన్న వాటి ద్వారా మీరు ఎదుటి వాళ్ళకి ఎంతో సులువుగా సంతోషాన్ని ఇవ్వచ్చు.
నిజమైన కాంప్లిమెంట్స్ ఇవ్వడం:
ఎప్పుడైనా ఏదైనా ఎదుటి వాళ్ళు చేసినవి నచ్చినా లేదా వాళ్లలో ఉండే గొప్ప విషయాన్ని ఎంతో సిన్సియర్ గా మీరు చెప్పి నిజమైన కాంప్లిమెంట్ ఇవ్వండి. దీని వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు.
మీరు చేసిన వాటిని బహుమతిగా ఇవ్వడం:
మీరు వేసిన పెయింటింగ్ లేదా రాసిన కవితనో వాళ్ళకి బహుమతిగా ఇవ్వడం వల్ల వాళ్ల ఆనందం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక చిన్న గిఫ్ట్ వాళ్ళని చాలా ఆనంద పరుస్తుంది గుర్తుంచుకోండి.
ప్రోత్సహించడం:
ఎదుటి వాళ్ళకి ఏదైనా బాధ కలిగినా లేదంటే కష్టమైన సందర్భం ఎదురైనా.. ధైర్యంగా మీరు భరోసా ఇవ్వండి. అలానే మీరు ఇవ్వగలిగే సూచనలు సలహాలు ఇచ్చి వాళ్ళని కష్టాల నుంచి బయట పెట్టండి. ఇలా చేయడం వల్ల వాళ్లలో మీరు ఆనందాన్ని నింప గలరు. ఇలా వాళ్ళకి నచ్చినవి చేసిన వాళ్ళు ఆనందపడతారు.