పంచాయతీ ఎన్నికల్లో ఉండే ఆ మజా వేరు. నోటిఫికేషన్ వెలువడి నుంచి పోలింగ్ అయ్యే దాగా పగోడైనా వారితో స్నేహం చేయడం, బుజ్జగించడం, వారి బాగోగులు చూసుకోవడం చూస్తునే ఉంటాం. గ్రామాల్లో ఎన్నికలు వచ్చాయంటే పట్టణాల్లో ఉన్న గ్రామస్థుల రాకపోకలకు అయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని రప్పిస్తుంటారు. పంచాయతీ ఎన్నికలకు ఉంటే గ్రేజ్ అలాంటిది. ఓకే ఒక ఓటుతో ఫలితాలే తారుమారయ్యే సంఘటనలు చాలానే ఉన్నావి. ఆంధ్రలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థులు నానా తిప్పలు ఎదుర్కుంటున్నారు. తమ గ్రామం నుంచి ఎవరేవరూ ఎక్కడున్నారో అంటూ ఆరా తీసేందుకు పోటీ పడుతున్నారు.
ముందుగానే టికెట్లు బుక్ అయ్యాయి..
కృష్ణా జిల్లాకు చెందిన అనేక మంది విదేశాల్లో స్థిరపడ్డారు. పెనమలూరు, కంకిపాడు గ్రామాలకు చెందిన దాదాపుగా 5 వేల మంది ఉద్యోగం, వలస నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఇక్కడే ఓటు ఉండడంతో ఎన్నికల సమయంలో వచ్చి ఓటేసి వెళ్తుంటారు. ప్రస్తుతం అలాంటి వారికి కాకా పట్టేందుకు అభ్యర్థులు వారి ఇళ్లకు రాత్రీ పగలు తేడా లేకుండా తిరుగుతున్నారు. వారున్న చోటు, ప్రాంతాలో వివరాలు తెలుసుకున్న ప్రత్యేక్ష్యంగా, ఫోన్లలో చర్చించుకుంటున్నారు.
తమకే ఓటేయాలని, మీకయ్యే బస్సు, రైలు ఖర్చులన్నీ తామే భరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. ఓకే కుటుంబం ఎక్కువ ఓట్లున్న వారికి విమాన టికెట్లు బుక్ చేస్తాం రావాలని కోరుతున్నారు. మరి కొందరైతే రానుపోను విమాన టికెట్లతో పాటు మీరుండేందుకు 8–10 రోజుల ఏర్పాట్లు కూడా చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. విజయనగరానికి సమీపంలోని పైడూరుపాడు గ్రామానికి చెందిన చాలా మంది యువకులు వివిధ రాష్ట్రాల్లో ఉంటున్నారు. వారిని రప్పించేందుకు ఓ నేత ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నాడని ఆ గ్రామంలో గుసగుసలాడుతున్నారు.