మహిళలను వేధిస్తే సహించేదే లేదు.. మంత్రి సీతక్క కీలక హెచ్చరిక

-

మహిళలను వేధిస్తే సహించే ప్రసక్తే  లేదని  మంత్రి సీతక్క కీలక హెచ్చరిక జారి చేసింది. మాదాపూర్ టెక్ మహీంద్రా లెర్నింగ్ వరల్డ్ లో తెలంగాణ సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్ వర్కింగ్ నిర్వహించిన వార్షిక లీడర్ షిప్ కాన్క్లేవ్ 2024లో పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు చేసే మనస్తత్వం ఉందని అందువల్లనే మహిళలు వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న స్త్రీలు తోటి మహిళలకు తగిన ప్రోత్సాహం అందించాలని సూచించారు.

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పని ప్రదేశంలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇంకా వారెక్కడ సురక్షితంగా ఉంటారని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలు నగరాలకే పరిమితం కాకూడదని.. గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా  ఎదిగినప్పుడే సమాజంలో మహిళలకు విలువ పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పరిశ్రమల స్థాపనకు ఆమె పిలుపునిచ్చారు. దీంతో మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version