BREAKING : అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్‌ గుడ్‌బై

టీమిండియా క్రికెట‌ర్, ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు హర్భజన్‌సింగ్‌ గుడ్ బై చెప్పారు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్న‌ట్లు హర్భజన్ సింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు అధికారికంగా… త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.

“ఎన్నో మంచి అవ‌కాశాలు నాకు వ‌చ్చాయి. ఈ రోజు నేను జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా మరియు చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కెరీర్ నాకు స‌హ‌క‌రించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు హ‌ర్భ‌జ‌న్ సింగ్‌.

కాగా..హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు 367 అంత‌ర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఏకంగా 711 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇందులో రెండు టెస్ట్ సెంచ‌రీలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు.