క్రిష్ దర్శకత్వంలో ‘వీరమల్లు’ చేస్తున్న పవన్…

-

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగు చేస్తున్న విషయం తెలిసిందే… ఈ చిత్రం మొదలై చాలా కాలమైంది. అయితే కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగు వేగంగా జరగలేదు. భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోట్ల రూపాయల ఖర్చుతో వేసిన సెట్స్ లో ఈ షూటింగును జరుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సముద్రఖని దర్శకత్వంలో తమిళ రీమేక్ మూవీ షూటింగును పవన్ పూర్తి చేశాడు. దాంతో మరి ”వీరమల్లు’ మాటేమిటి? అనేది అందరిలో సందేహాన్ని కలిగిస్తోంది.

Pawan Kalyan Krish movie break reasons - Cine Chit Chat

ఈ సినిమా షూటింగు ఇంతవరకూ 65 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఏప్రిల్ లోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ వాయిదా పడింది. అలాంటి ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పటికే రామ్ – బోయపాటి సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ మెంట్ వచ్చింది. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా అక్టోబర్ 20న రానున్నట్టు ప్రకటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news