మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు – హరీష్ రావు

-

మోడీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అంటూ మంత్రి హరీష్ రావు చురకలు అంటించారు. తెలంగాణ కోసం గతంలో లో ఉద్యమం కోసం ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని.. గతంలో ఎంతో మంది ప్రదాని గా ఉన్నా ఇప్పుడు ఎందుకు వడ్లను ఎందుకు కొంటాలేరు అని ప్రశినిస్తున్నాని పేర్కొన్నారు. కేంద్ర ఓ వ్యాపార వేత్త లాగా ప్రవర్తిస్తుందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

11 లక్షల కోట్లు బడా వ్యాపారులకు… డబ్బు మాఫీ చేస్తుంది కానీ రైతులు కష్ట పడి వడ్లు పండిస్తే ఎందుకు కొనడం లేదు.మోడీ అంటే మోదుడు బీజేపీ అంటే బాదుడు లాగా బీజేపీ పార్టీ తయారు అయ్యిందన్నారు. గతంలో గ్యాస్ ధర పెంచితే ప్రజలు రోడ్డుపై ధర్నా లు చేసేవారు, ఇప్పుడు బీజేపీ ప్రభుతవములో సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని.. రేపు కేంద్ర ప్రభుత్వం శవ యాత్ర చేపట్టాలని పిలుపునిచ్చారు.
రేపు ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటి మీద నల్ల జండా ఎగుర వేసి నిరసన చేపట్టాలని.. ప్రతి ఇంటిపై నల్లా జెండా ఎగరాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యం పడాలని.. 11న కేంద్రం ప్రభుత్వం తీరుపై ఢిల్లీలో నిరసన చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version