రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ బస్టాప్ వద్ద ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు ఏమైందోనని ఆందోళన చెందారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు కాల్ చేశారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఇదంతా గమనించాడు. జనం గుమిగూడటంతో అటుగా వెళ్లి ఏమైందోనని చూశారు కానిస్టేబుల్ రాజశేఖర్.
ఓ యువకుడి కుప్పకూలడం గమనించి సమయస్ఫూర్తితో వెంటనే అతడికి సీపీఆర్ చేశారు. సీపీఆర్‌కు స్పందించిన యువకుడు చాలాసేపటి తర్వాత కళ్లు తెరిచాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. హ్యాట్సాఫ్ టు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ అంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.
Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko
— Harish Rao Thanneeru (@BRSHarish) February 24, 2023