హుజూరాబాద్ లో దళిత బంధు పథకం అమలు పై.. తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దళిత బంధు పథకం అమలు పై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. దళిత బందు ఎల్లుండి సీఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. హుజూరాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని హరీష్ రావు మరో సారి స్పష్టం చేశారు. కావాలనే బీజేపీ పార్టీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నదని మండిపడ్డారు.
హుజూరాబాద్ లోని దళితుల అందరికీ దళిత బంధు పథకం అందిస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. గతంలో రైతు బందు మీద కూడా ఇలాంటి నిందలే వేశారని.. కరోనా సమయంలో కూడా రైతు బందు వేసింది తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. రైతు బందు కు చప్పట్లు కొట్టిన నాయకులే..ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఉన్నారని మండిపడ్డారు. ఓటమి భయం తో ప్రజలను రెచ్చగొడుతున్నారని బిజేపి నాయకులపై మండిపడ్డారు. దళిత బంధు పథకం అమలు కోసం హుజూరాబాద్ నియోజక వర్గానికి రూ. 2000 కోట్లు తెలంగాణ కేబినెట్ మంజూరు చేసిందన్నారు.