ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై నడ్డా వ్యాఖ్యలకు హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సభ డైలాగుల కోసం పాకులాడిన్నట్లుందని విమర్శించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్ అంటే.. ఓటమి లేదని నడ్డా అంగీకరించినట్లే. వీఆర్‌ఎస్ అంటే స్వచ్ఛంద విరమణ. మేం స్వచ్ఛంద విరమణ చేస్తే తప్పా మాకు ఓటమి లేదని నడ్డానే అన్నారు. బీజేపీకి ఎంతసేపు రాజకీయాలు తప్ప అభివృద్ధి లేదు’’ అని హరీశ్ రావు విమర్శించారు.
టీఆర్‌ఎస్ కాస్తా.. బీఆర్‌ఎస్‌గా మారిందని.. అతి త్వరలోనే ఆ పార్టీకి వీఆర్‌ఎస్ తప్పదని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందనేలా’ కేసీఆర్ వైఖరి ఉందని ఆ సామెతను నడ్డా తెలుగులో చెప్పి.. సభికుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. ముఖ్యమంత్రికి ఆయన కుమార్తె, కుమారుడు, అల్లుడు తప్ప.. ఎవరూ కనిపించడంలేదన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.