Video Viral : శ్రెయా ఘోషల్ పాటకు ఇన్ఫోసిస్‌ సుధామూర్తి డ్యాన్స్‌

-

సుధామూర్తి.. ఈమె గురించి తెలియని వారంటూ ఉండరు. ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగా అందరికీ పరిచయమైనా.. తన కంటూ సొంతగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధామూర్తి. తన దాతృత్వం, యంగ్ జనరేషన్ కు ఇచ్చే ప్రోత్సాహంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధ్యాపకురాలిగా.. రచయిత్రిగా.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ గా ఆమె ఎన్నో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. వేల కోట్లకు అధినేత్రి.. కోటీశ్వరుడికి సతీమణి.. ఏకంగా బ్రిటన్ ప్రధానికి అత్త అయినా.. సుధామూర్తి చాలా నిరాడంబరమైన జీవితం గడుపుతారు.

మణిరత్నం పాటకు ఇన్ఫోసిస్‌ సుధామూర్తి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌..!

సుధా మూర్తికి సంబంధించి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ఫోసిస్ కంపెనీ 40వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుధామూర్తి ఎంతో హుషారుగా డ్యాన్స్‌ చేశారు. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్.. మణి రత్నం ‘గురు’ సినిమాలోని ‘బర్సోరే మేఘా మేఘా..’ పాటను ఆలపించగా.. సుధా మూర్తి గొంతు కలిపి.. హుషారైన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news