హీనమైన చరిత్ర కాంగ్రెస్ ది : మంత్రి హరీష్ రావు

-

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు రాహుల్ గాంధీ పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు.. బుధవారం మంత్రి హరీష్ రావు పెద్దపల్లిలో 100పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ ఎందుకోసం వస్తున్నావ్‌..? ఏం చెప్పడానికి వస్తున్నావ్..? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్ ది అని హరీష్ రావు మండిపడ్డారు. అధికారం కోసం ఎంత నీచమైన స్థాయికైనా దిగజారే పరిస్థితి వారిది అంటూ విమర్శించారు హరీష్ రావు..

తెలంగాణ రావొద్దని అడ్డం పడ్డ ద్రోహి చంద్రబాబుతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా..? అధికారం కోసం ఆత్మాభిమానం మంట గలిపెస్తారు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు హరీష్ రావు. మాది బతుకు దెరువు కోసం ఆరాటం.. వాళ్లది కుర్చీల కోసం కొట్లాట అని.. తెలంగాణకు ఏం చేశారని చెప్పడానికి వస్తున్నావు రాహుల్ గాంధీ అని నిలదీశారు.కాంగ్రెస్ అంటే విత్తనాల కొరత, కరెంట్ కోతలు, ఎరువుల కొరత.. రైతుల కష్టాలు, కన్నీళ్లు.. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ నీళ్ళు రాక పంటలు ఎండి పోయేవి అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news