పెళ్లైన నటితో ఆ హీరో ప్రేమాయణం..

-

హర్షవర్ధన్ రానే.. తెలుగులో పలు సినిమాల్లో నటించాడు. అయితే ఇక్కడి దర్శకులు ఇతడిని పెద్దగా పట్టించుకోకపోవడంతో బాలీవుడ్ వెళ్లి ప్రయత్నించగా అక్కడ బాగా క్లిక్ అయ్యాడు. దీంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు అక్కడ లేడీ యాక్టర్స్ తో కూడా డేటింగ్ లు చేసి పాపులర్ అయ్యాడు. కిమ్ శర్మ, మీనాక్షి దాస్ తో ప్రేమాయణం నడిపి విడిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లయిన భామతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Is Harshvardhan Rane dating Sanjeeda Shaikh? Actor breaks silence |  PINKVILLA

బాలీవుడ్ నటి సంజీదా షేక్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడైన అమీర్ అలీని వివాహం చేసుకున్న సంజీదా.. 2021లో విడాకులు తీసుకుని విడిపోయింది. అయితే హర్షవర్ధన్‌తో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. ఈ మేరకు వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్‌లో బిజీగా ఉన్నట్లు బి-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. కాగా.. గతంలో ఇద్దరితో లవ్ స్టోరీ నడిపిన ఈ అందగాడు ఇప్పుడు ఏకంగా పెళ్లైన నటితో ముచ్చటగా మూడో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news