తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదేవిధంగా వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. 1990 బ్యాచ్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.
శైలజా రామయ్యర్, దాసరి హరిచందన, అలగు వర్షిణి, కొర్రా లక్ష్మీ, కే. హైమావతి, కే. హరిత, కే. స్వర్ణలత, కె. నిఖిలా, ఎం. సత్య శారద దేవి, అల ప్రియాంక, ఇల త్రిపాఠి, కృష్ణ ఆదిత్యలకు కొత్త పోస్టింగ్‌లు కల్పించింది. వీరితో పాటు ముజమిల్ ఖాన్, సంగీత సత్యనారాయణ, ప్రతీక్ జైన్, గౌతమ్ పాత్రు, వెంకటేశ్ దోత్రు, అభిలాష అభినవ్, స్నేహ శబరీష్, మను చౌదరి, దివాకర, అనుదీప్ దురిశెట్టి, శ్రీ కుమార్ దీపక్, చెక్క ప్రియాంక, జల్తా అరుణశ్రీ, బాడుగ చంద్రశేఖర్, నవీన్ నికోలస్, ప్రతీమ సింగ్, గరిమ అగర్వాల్, మంద మకరందులకు కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.