ప్రముఖ యూ ట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. గత మూడు రోజులకు పైగానే హర్ష సాయితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు. ఇప్పటికే హర్షసాయిపై రేప్, చీటింగ్ కేసు నమోదైంది.తనకు మత్తు మందు ఇచ్చి రేప్ చేశాడని బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ప్రస్తుతం 4 ప్రత్యేక బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. అయితే, తనపై యువతి కావాలనే తప్పుడు ఆరోపణలు చేసిందని, ఇదంతా డబ్బు కోసమే అని హర్షసాయి మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా తనకు, యువతికి మధ్య జరిగిన కాల్ సంభాషణ, గొడవకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకు లీక్ చేశాడు. ప్రస్తుతం హర్షసాయి పరారీలోనే ఉన్నట్లు సమాచారం. బెంగళూరు లేదా గోవాకు అతను పారిపోయినట్లు నార్సింగి పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు అత్యాచార బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.