లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.ప్రస్తుతం జమ్ముకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలు, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఆయన టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి అరుదైన ఘనత దక్కింది. మినిస్ట్రీల పనితీరుపై దృష్టి పెట్టే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు ఏర్పాటైనట్లు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కింది. సోనియా గాంధీకి ప్రస్తుతం ఎటువంటి పదవి దక్కలేదు. ఫైనాన్స్‌ను భర్తృహరి, విదేశాంగ శాఖను శశిథరూర్ నడిపిస్తారు. టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీకి ఒక్కో కమిటీలో నాయకత్వం దక్కింది. అగ్రికల్చర్, పుడ్ ప్రాసెసింగ్, పంచాయితీ రాజ్‌కు కాంగ్రెస్ నేతలే సారథులుగా వ్యవహరిస్తున్నారు.