ఇండియా కూటమి ప్రచారము జోరు తగ్గిందా..?

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది..ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ 19వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమవుతుండగ,జూన్ 04న ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. కాగా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించింది.

లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఇండియా కూటమి ప్రచారం చర్చనీయాంశమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపుర్-ముంబై రాహుల్ యాత్ర చేసినా అది రాజకీయంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనేది విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి బీజేపీపై విమర్శలకు పరిమితం కాకుండా తమ ఎజెండా ఎంటో వివరించి, ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news