గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్- ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ ను క్రికెట్ లవర్స్ ఎవరూ మరిచిపోలేరు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ లవర్స్ కు, ఆ టీంకు పీడ కలను మిగిల్చింది. దీనంతటికి ఓకే కారణం.. హసన్ అలీ, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మాథ్యూవేడ్ క్యాచ్ ను డ్రాప్ చేయడం. ఈ లైఫ్ తో బతికిపోయిన మాథ్యూవేడ్ వరసగా మూడు సిక్సులు కొట్టి ఆస్ట్రేలియాను గెలిపించాడు. అప్పటి దాకా పాకిస్తాన్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా ఆస్ట్రేలియా వైపు వెళ్లింది.
ఈ క్యాచ్ డ్రాప్ పై తొలిసారిగా పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ స్పందించాడు. నవంబర్ 11,2021లో ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్ మ్యాచ్ లో మాథ్యవేడ్ క్యాచ్ వదిలిపెట్టినందుకు చాలా బాధపడ్డానని హసన్ అలీ అన్నాడు. నా జీవితంలో అది కఠిన సమయంగా చెప్పుకొచ్చాడు. రెండు రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నానని వెల్లడించాడు. ఆ సమయంలో నన్ను అలా చూసి నాభార్య తీవ్ర ఆందోళన చెందిదని వెల్లడించాడు. ఆ తరువాత మూడు రోజులు పాటు దాదాపు 500 క్యాచులు ప్రాక్టిస్ చేశానని తెలిపాడు.
హసన్ అలీ క్యాచ్ వదిలిపెట్టడంపై నెటిజెన్లు ఓ రేంజ్ లో ఆటాడుకున్నారు. కామెడీ మీమ్స్ చేశారు. ముఖ్యంగా పాక్ అభిమానులైతే ఏకంగా హసన్ అలీ భారత ‘రా’ ఏజెంట్ అంటూ.. ట్రోల్ చేశారు. ఇండియన్ నెటిజన్లు కూడా ఆ ఓవర్ వేసిన బౌలర్ షాహీన్ ఆఫ్రిదితో పాటు హసన్ అలీని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.
This catch drop hasan ali australia win the match
Bad luck😭😭😭😭 pic.twitter.com/URopr2ptRm— Mudassar Iqbal (@Mudassa21479018) November 12, 2021