ఇంద్రజను ఇలా ఎప్పుడైనా చూసారా.. కుర్రాళ్ళ గుండెలు గల్లంతే..!!

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక తన నటనతోనే కాదు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించి మరీ ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆలీతో యమలీల సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఇంద్రజ.. ఆ తర్వాత మరెన్నో సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇక ఈమె దూకుడు చూసి కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందని అనుకున్న సమయంలోనే తల్లి అనారోగ్య బారిన పడడం .. వివాహం జరగడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.

ఇక పిల్లలు కూడా జన్మించడంతో ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక అలా దాదాపు పది సంవత్సరాలపాటు సినీ ఇండస్ట్రీకి దూరమైన ఇంద్రజ మళ్ళి తన సెకండ్ ఇన్నింగ్స్ ను వెండితెరపై కాకుండా బుల్లితెరపై ప్రారంభించింది. ప్రస్తుతం బుల్లితెర ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో మొన్నటి వరకు జడ్జ్ గా వ్యవహరించిన ఇంద్రజ అక్కడ సుధీర్ వెళ్లిపోవడంతో తాను కూడా ఇబ్బంది పడింది. ఇక వెంటనే జబర్దస్త్ లోకి జడ్జిగా బాధ్యతలు చేపట్టింది. ప్రస్తుతం కృష్ణ భగవాన్ తో కలిసి జడ్జిగా ప్రేక్షకులను అలరిస్తోంది. తనదైన కామెడీ పంచలతో అటు కమెడియన్స్ ని కూడా తనదైన శైలిలో అలరిస్తోందని చెప్పవచ్చు.

ఇకపోతే ఎప్పుడూ సారీస్ లో దర్శనమిచ్చే ఇంద్రజా ను చాలామంది అవుట్ ఫిట్ లో చూడలేదని చెప్పవచ్చు. ఇకపోతే ఇంస్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అవుతున్న ఈమె అవుట్ ఫిట్ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అచ్చం పదహారణాల పడుచు పిల్లలా తన అందంతో కుర్రాళ్ళ ను సైతం ఆకట్టుకుంటుంది. ఇక ఈమె అందాలకు యువత కూడా ఫిదా అవుతున్నారని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news