ఖాతాదారుల‌కు HDFC బ్యాంక్ ఝుల‌క్‌..!

-

దేశీయ ప్రైవేటు బ్యాంకు దిగ్గ‌జం HDFC త‌న ఖాతాదారులకు షాక్‌చ్చింది. మాంద్యం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఆ భారాన్ని త‌గ్గించుకునేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌దారుల‌కు చెల్లించే వడ్డీరేట్ల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. తీసుకున్న నిర్ణ‌యం కూడా వెంట‌నే అమ‌ల్లోకి తీసుకురావ‌డం గ‌మ‌నార్హం. ఈనెల 16న బ్యాంకు ఉన్న‌తాధికారుల స‌మీక్ష‌లో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి తుద‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే బ్యాంకు డిపాజిట్‌దారుల‌పై ఖ‌చ్చితంగా ఇది ప్ర‌తికూలత చూపుతుంద‌ని బ్యాంకింగ్ నిపుణులు, ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 3.5 శాతం వడ్డీ లభిస్తోంది. 15 రోజుల నుంచి 29 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ పొందొచ్చు. 30 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ వస్తోంది. 46 రోజుల నుంచి 6 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.4 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు.

HDFC Bank sharply cuts fixed deposit
HDFC Bank sharply cuts fixed deposit

ఆరు నెలల ఒక్క రోజు నుంచి 9 నెలల ఎఫ్‌డీలపై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. 9 నెలల నుంచి ఏడాదిలోపు మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.05 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే సాధారణ డిపాజిట్లకు ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గింది. దీంతో వీటిపై ఇప్పుడు 6.3 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీలపై వడ్డీ రేటు కూడా 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. వీటిపై ఇప్పుడు 6.3 శాతం వడ్డీనే వస్తుంది.

వాస్త‌వానికి హెచ్‌డీఎఫ్‌సీ అంటే బ్యాంకింగ్ రంగంలోనే ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌గా దేశ ప్ర‌జ‌లు గుర్తించారు. హౌసింగ్‌లోన్ల‌కు ఇంత‌కు మించిన బ్యాంకు మ‌రోటి లేద‌ని విశ్వ‌సిస్తుంటారు. ప్ర‌ధాన‌మైన బ్యాంకుల్లో ఒక‌టిగా నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ నిర్ణ‌యం కోట్లాది మంది ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారుల‌పై ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news