సొంతింటిని నిర్మించుకోవాలని ఎవరికి ఉండదు..?, సొంతింటి కలని సాకారం చేసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ వుంటారు. కానీ నిజంగా ఇది జరగడం అనుకున్నంత సులభం కాదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశీ దిగ్గజ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ తో పార్టనర్ షిప్ ని కుదుర్చుకోవడం జరిగింది.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దేశీ దిగ్గజ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కనుక ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఈజీగా హోమ్ లోన్స్ వస్తాయి. అయితే ఈ కస్టమర్స్ అందరికీ కూడా హోమ్ లోన్స్ అందుబాటు లోకి రానున్నాయి.
అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా లోన్ ని తీసుకో వచ్చు. ఇక పోతే దేశ వ్యాప్తంగా 650కి పైగా బ్రాంచులు, 1,36,000 బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్లు (పోస్టాఫీస్‌లు) కలిగిన ఐపీపీబీకి 4.7 కోట్ల మంది పైగా కస్టమర్లు వున్నారు. అలానే పోస్టాఫీస్‌ల ద్వారా కూడా హోమ్ లోన్స్ ని అందించనుంది. అలానే లోన్ ప్రాసెస్, రుణ మంజూరు వంటి తదితర అంశాలు మొత్తం హెచ్‌డీఎఫ్‌సీ చూడడం జరుగుతుంది.