Allu Arjun: “ఐకాన్” మళ్ళీ మూలాన పడిన‌ట్లేనా?

-

Allu Arjun: తెలుగు సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కూడా క్రేజ్ మామూలు కాదు. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీ గా ఉన్నాడు అల్లు అర్జున్. బ‌న్నీ స్టైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. కానీ, ఐకాన్ ప్రాజెక్ట్ ను మాత్రం సెట్ మీదికి రావ‌టం లేదు. ఐకాన్ మూవీ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది ఇప్ప‌టికే రెండేండ్లు దాటింది. ఈ ప్రాజెక్టు వెనుక‌ప‌డ్డటానికి అనేక కార‌ణాలు వినిపిస్తున్నాయి. రకరకాల ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

తొలుత రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో అల్లు అర్జున్ కి దిల్ రాజుకి సెట్ అవ్వడం లేదని కొన్నాళ్ళు. అలాగే స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్.. బన్నీ అసంతృప్తి ఉన్న‌డ‌ని టాక్‌. ఇలా ఐకాన్ మూల‌న ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఐకాన్ మూవీని ప‌క్క‌న పెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురము చిత్రానికి, సుకుమార్ పుష్ప చిత్రాలను కూడా ఓకే చేసాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప ది రైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కానుంది.

మ‌రోవైపు.. వకీల్ సాబ్’ సక్సెస్ కావ‌డంతో వేణు శ్రీరామ్ పై బ‌న్నీకి నమ్మకం పెరిగింద‌నీ, ‘పుష్ప’ పార్ట్ 1 తర్వాత ఐకాన్ ప్రాజెక్ట్ చేయ‌డానికి రెడీగా ఉన్న‌డ‌నీ టాక్ వ‌చ్చింది. అయితే మళ్ళీ ఇప్పుడు బ‌న్నీ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు టాక్. ఎక్కువ శాతం బోయపాటి శ్రీనుతో బన్నీ నెక్స్ట్ మూవీ చేసే అవకాశముందని అంటున్నారు. అఖండతో బోయపాటి హిట్ కొడితే.. వెంటనే అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా పట్టా లెక్కుతుందిట. ఏదేమైనా అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news