కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడేనని జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అని ఆయన అన్నారు.
బీజీపీని, టీడీపీని కలపడంలో జనసేన సఫలీకృతమైందన్నారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర పూర్తి వెనుకబడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంసధార, సుజల స్రవంతి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులనైనా కుమారుడు ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేయలేకపోయారని కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిన అవసరం ఉందని కొణతాల రామకృష్ణ తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరిగాయి. ఇక వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4 న వెలువబడుతాయి.