ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్ శాతం ఎంత నమోదయిందంటే ?

-

ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది.ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సరిగ్గా సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈసీ రూల్స్ ప్రకారం సాయంత్రం 4 గంటల లోపు పోలింగ్ బూత్‌లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగ్గా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది.ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు.

ఇదిలా ఉంటే… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రస్తుతానికి 68.65 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ వెల్లడించింది. కొన్ని బూత్‌లలో ఇప్పటికీ ఓటర్లు క్యూలో ఉండటంతో పూర్తిస్థాయి పోలింగ్ శాతం వివరాలు వెల్లడి అయ్యేందుకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నికను బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ,బీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి,బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news