తెలుగులో టాప్ హీరో అతనే..!

-

తెలుగులో టాప్ హీరో ఎవరు? ఎవరికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు? అని అడిగితే ఏ అభిమాని అయినా సరే తమ హీరో గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి అసలు నెంబర్ వన్ హీరో అనే విషయం మీద ఎప్పటినుంచో చర్చ జరుగుతూనే వస్తూ ఉంది.. ఈ క్రమంలోని ఈ విషయాన్ని ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోవడం కూడా అరుదైన విషయమే. ఎందుకంటే ఏ హీరో తక్కువ కాదు.. మరో హీరో ఎక్కువ కాదు.. ఎవరికి తగినట్లుగా వారికి అభిమానులు ఉంటారు.. అయితే ఇలాంటి ఇబ్బందులను గమనించిన ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల టాప్ హీరోలుగా ఎవరున్నారు అనే విషయాన్ని ఒక లిస్టు లాగా ప్రచురిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే హీరోల జాబితాను ఎప్పుడూ ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రచురిస్తూ ఎవరు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనే విషయాన్ని తెలియజేస్తుంది. నవంబర్ నెలకి గాను ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాను ఇప్పుడు తెలుగు హీరోలకు సంబంధించిన లిస్టు కూడా విడుదలయ్యింది. ఎప్పటిలాగే ఈ లిస్టులో ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్.. మూడవ స్థానంలో అల్లు అర్జున్ నిలిచారు. నాలుగో స్థానం మహేష్ బాబుకు లభించగా.. 5వ స్థానం రామ్ చరణ్ దక్కించుకున్నారు.

ఆరవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత స్థానాలలో నేచురల్ స్టార్ నాని, చిరంజీవి, విజయ్ దేవరకొండ, రవితేజ తమ స్థానాలను కైవసం చేసుకున్నారు. తెలుగులో వీరిందరు టాప్ టెన్ హీరోలు కాగా మిగిలిన టైర్ -2 తో హీరోలు కూడా చాలామంది ఇప్పుడు నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news