విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ విడుదల

-

జేఈఈ మెయిన్ 2023 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను నిన్న విడుదల చేసింది. దీని ప్రకారం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరుగుతాయి. 26న రిపబ్లిక్ డే నాడు పరీక్ష ఉండదు.

JEE Main Result 2020: JEE Main answer key 2020 and JEE Main merit list 2020  date JEE Main 2020 cut offs | Higher News – India TV

జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం నిన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు
స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షల కోసం ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ భాషల్లో ప్రశ్న పత్నాలు సిద్ధమవుతున్నాయి. కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 2021, 2022 సంవత్సరాల్లో 12వ తరగతి, లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news