మూత్రం పోయోద్దు అన్నందుకు తగలబెట్టేసాడు…!

-

ఎస్‌యూవీ వాహనంపై మూత్ర విసర్జన చేయకుండా అడ్డుకున్నందుకు ఒక ఆటో యజమాని పూణేలోని ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పూణేలోని భోసరి ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సెక్యూరిటీ గార్డు శంకర్ వేఫల్కర్ (41) కు కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు వివరించారు.What State Of Matter Is Fire?. Look back to literally anywhere in time… |  by Amelia Settembre | The Startup | Medium

ఆటో రిక్షా డ్రైవర్ మహేంద్ర బాలు కదమ్ (31) ను అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 307 (హత్యాయత్నం) మరియు ఇతర సంబంధిత సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం, వేఫల్కర్ సంస్థ ప్రధాన ద్వారం వద్ద విధుల్లో ఉన్నాడని పోలీసులు ఘటనను వివరించారు. అటు వైపు వెళుతున్న కదమ్ తన ఆటో రిక్షాను అక్కడే ఆపి సంస్థ యజమాని ఎస్‌యూవీపై మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాని అడ్డుకున్నందుకు తిరిగి పెట్రోల్ తెచ్చి కాల్చేసాడు అని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news