తెలంగాణలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫీవర్ మొదలైంది. సమయం చాలా తక్కువగా ఉండడంతో పార్టీలు అన్ని ఆదరాబాదరా అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే ఏపీలో జనసేన – బీజేపీలు పొత్తు పెట్టుకున్న క్రమంలో ఇక్కడ కూడా పొత్తు ఉంటుందని భావించారు. అయితే ఇక్కడ ఆ పొత్తు ఉండదని నిన్న బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో నిన్నటి నుంచి జనసేన పరిస్థితి ఏమిటి ? అనే సందిగ్ధత నెలకొంది. పోటీ చేస్తున్నట్టు పవన్ కూడా ప్రకటన చేశారు, ఇక ఈ రోజు తెలంగాణ జనసేన ఇంచార్జ్ శంకర్ గౌడ్ కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.
మొదటి జాబితా ను ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయం కానీ విడుదల చేస్తామని ఆయన అన్నారు. 25 నుండి 30 మందితో మొదటి జాబితా ఉద్నున్త్ని, 14 నియోజకవర్గా ల్లో పోటీకి దిగుతున్నామని అన్నారు. 45 నుండి 60 డివిజన్లలో పోటీకి సిద్ధంగా ఉన్నామన్న ఆయన ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్,జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ ,కూకట్ పల్లి, శేరి లింగంపల్లి ,ఖైరతాబాద్, కార్వాన్,అంబర్ పేట,సనత్ నగర్, పఠాన్ చేరు, ముషీరాబాద్ లో పోటీ చేస్తున్నామని అన్నారు. ఎక్కడైతే మాకు బలం ఉందొ అక్కడ పోటీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేస్తామని ఆయన అన్నారు.