యాలకులుని కొన్ని వంటల్లో వేయకపోతే ఆ వంటికి రోజే ఉండదు. వంటల్లో ఉపయోగించడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా రకాలుగా మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే యాలకుల లో రకాలు కూడా ఉన్నాయి. యాలుకలు ఆకుపచ్చ రంగు లో మరియు నలుపు రంగులో కూడా దొరుకుతూ ఉంటాయి. యాలుకల్ని తీసుకోవడం వల్ల మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు దీనిలో ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ చక్కగా జరిగేలా చూస్తాయి.
కడుపులో మంట, నొప్పి వంటివి పోగొడతాయి. అలాగే పొట్ట లో విడుదలయ్యే బైల్ ని యాలకలు క్రమబద్దీకరిస్తుంది. ఆస్తమాకు యాలకులు విరుగుడుగా పని చేస్తాయి. కఫం, దగ్గు ఊపిరాడక పోవడం, చాతి దగ్గర ఏదో పట్టేసినట్లు ఉండడం వంటి సమస్యలను కూడా యాలుకలు చిటికె లో తరిమికొడతాయి. కనుక రెగ్యులర్ గా మీరు వీటిని ఉపయోగిస్తే ఈ సమస్యను సులువుగా పోతాయి.
డయాబెటిస్ ఉన్న వాళ్లు కూడా వాటిని తీసుకోవచ్చు. వీటి వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమిటంటే దీనిలో ఎక్కువగా ఉండే మాంగనీస్ డయాబెటిస్ ను తగ్గిస్తుంది. బీపి తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువ తక్కువ కాకుండా ఇది చూస్తుంది. కాబట్టి సూప్స్, బేకింగ్ ఐటమ్స్ లో కూడా ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. యాలకులు రుచి, సువాసన తో మన టెన్షన్స్ ని పోగొడుతుంది.
హార్ట్ ఫెయిల్యూర్, ఉద్రేకతను కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా ఒత్తిడి ఏమైనా ఏర్పడితే యాలకులతో టీ చేసుకుని తాగండి. లేదంటే పాలల్లో వేసుకుని తాగితే కూడా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ చిట్కాని ప్రయత్నం చేయండి. క్యాన్సర్ ను సహజ సిద్ధంగా తగ్గించే గుణాలు వీటిలో ఉన్నాయి. త్వరగా క్యాన్సర్ పెరిగి పోకుండా ఉండడానికి బాగా ఉపయోగ పడుతుంది. అంతే కాదండి సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకుల బాగా ఉపయోగ పడతాయి. దీని వల్ల పురుషులు నరాల పటిష్టతకు ఉపయోగ పడుతుంది కాబట్టి చిటికెడు యాలకుల పొడిని ప్రతి రోజు తీసుకున్నా సంతాన భాగ్యం కలుగుతుంది.